చరణ్ కు ‘మెగా’ గిఫ్ట్

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ ఈ నెల 27న పుట్టినరోజు జరుపుకోనున్నారు. కాగా చిరు తన తనయుడికి ముందస్తుగా శుభాకాంక్షలు చెబుతూ బహుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను చరణ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ముందుగానే టైమ్‌లెస్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అమ్మానాన్నకు ధన్యవాదాలు’ అని రాశారు. బహుమతిగా ఒక ఖరీదైన గడియారం ఇచ్చినట్లు తెలుస్తుంది.

కాగా చరణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘రంగస్థలం’విడుదలకు సిద్ధమైయింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అదించాడు. ఈ సినిమా భారీ అంచనాలు వున్నాయి.