Site icon TeluguMirchi.com

చిరు మాటను కూడా నయన లెక్క చేయలేదా ..?

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార కు ఎంతో గుర్తింపు ఉంది. లేడి ఓరియంటెడ్ కథలైనా, గ్లామర్ పరమైన పాత్రలైనా ఇలా ఏ రోల్ ఇచ్చిన సరే నయనతార అందులో నీలమవుతుంది. అందుకే ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆమెను తీసుకుంటారు. తాజాగా సైరా చిత్రానికి సైతం ఈమెకు సుమారు ఏడూ కోట్ల వరకు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పుడు ఈమె పట్ల మెగా అభిమానులతో పాటు సైరా చిత్ర యూనిట్ కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా కూడా కనీసం ఒక్కసారి కూడా ప్రమోషన్‌కు రాకుండా ఉండటం మాత్రం భావ్యం కాదంటున్నారు అభిమానులు. ఈ విషయంపై రామ్ చరణ్‌తో పాటు చిరంజీవి అడిగినా కూడా నయనతార నో చెప్పడంతో అసహనం పెరిగిపోతుంది. దాంతో చిరు కూడా నయన్ తీరుపై కాస్త కోపంగా ఉన్నాడని సమాచారం.

Exit mobile version