మెగా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అక్టోబర్‌లో లేదా నవంబర్‌లో పూర్తి కాబోతున్నాయి. సంక్రాంతికి ఆ సినిమా విడుదల కాబోతుంది. ఆ చిత్రం విడుదల కాకుండానే తన తదుపరి చిత్రంను అల్లు అర్జున్ ప్రారంభించబోతున్నాడు. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంను సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక ఈ చిత్రం గురించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేంటీ అంటే సుకుమార్ తన సినిమాలోని ప్రతి పాత్రను చాలా పవర్ఫుల్ గా చూపించాలని భావిస్తాడు. అందుకే సినిమాలో హీరోయిన్ పాత్ర కాకుండా కీలక పాత్రను విభిన్నంగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఆ పాత్రకు గాను మెగా డాటర్ నిహారికను ఎంపిక చేయాలని భావిస్తున్నాడు. సుకుమార్ నిర్ణయంను అల్లు అర్జున్ మరియు అల్లు అరవింద్‌లు కూడా సమర్ధించినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే నిహారికతో కథ చర్చలు జరిపిన సుకుమార్ ఆమెతో ఓకే చెప్పించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది దసరా కానుకగా అల్లు అర్జున్, సుకుమార్‌ల మూవీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.