Site icon TeluguMirchi.com

Nagababu : మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్..


Konidela Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా పార్టీ పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే గతంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్నట్లు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లి ఇచ్చిన నగదు బహుమతికి మరికొంత నగదును జతచేసి ఇండియన్ డిఫెన్స్ లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలకు తన వంతు ఆర్థికసహాయం చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Also Read : ‘దేవర’ అప్డేట్.. పోస్టర్ అదుర్స్..

“ఆపరేషన్ వేలంటైన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో AIR FORCE లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకి నా వంతు సాయం చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాటకి గాను వారికి నేను 6 లక్షల సహకారం అందించాను. ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు కాని ఇచ్చిన మాట మర్చిపోలేదన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దేశ సేవలో ప్రాణాలర్పించిన వారికి తోడ్పాటు అందించే అవకాశం రావడం చాల అదృష్టంగా ఉందని తెలియజేయడానికి” అంటూ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు మాట్లాడిన వీడియోని, ఇప్పుడు తాను డొనేట్ చేసిన డబ్బు ప్రూఫ్ ని షేర్ చేసారు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version