Site icon TeluguMirchi.com

మీడియా అంటే అంత చుల‌క‌నా..?

ram-gopal-varma-raajakeeyam-movie

మీడియాలో త‌న పేరు క‌నిపించ‌క‌పోయినా, వినిపించ‌క‌పోయినా క్ష‌ణం కూడా నిద్ర ప‌ట్ట‌దు రాంగోపాల్ వ‌ర్మ‌కి. అందుకే ఎల్ల‌ప్పుడూ ప్ర‌చారంలో ఉండేలా చూసుకొంటాడు. ట్వీట్ట‌ర్‌ల‌లో పిచ్చ పిచ్చ స్టేట్‌మెంట్లు ఇచ్చి… మీడియా దృష్టిని ఆక‌ర్షిస్తుంటాడు. మీడియాలో త‌ను క‌నిపించేంత వ‌ర‌కూ ఫామ్‌లో ఉన్న‌ట్టే జ‌మ క‌ట్టుకొన్నాడు వ‌ర్మ‌. అలాంటి వ‌ర్మ ఏకంగా మీడియాతోనే పెట్టుకొన్నాడు. ఆమ‌ధ్య ఐస్ క్రీమ్ కార్య‌క్ర‌మంలో మీడియాని ఉద్దేశించి చుల‌కన‌గా మాట్లాడాడు. ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. `మీడియాలో స్టాండ‌ర్డ్స్ ప‌డిపోయాయ‌ని తెలుసుగానీ, మ‌రీ ఇంత‌లా ప‌డిపోయాయ‌ని అనుకోలేదు.` అన్నాడు. వ‌ర్మ స‌ర‌దాగా అన్నాడో సీరియ‌స్‌గానే స్టేట్ మెంట్ ఇచ్చాడో తెలీదుగానీ, మీడియా మాత్రం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకొంది. అందుకే.. మంగ‌ళ‌వారం వ‌ర్మ ప్రెస్ మీట్ పెడితే మీడియా బాయ్‌కాట్ చేసింది. నిర్మాత‌లు మీడియా ప్ర‌తినిధుల‌కు ఎంత న‌చ్చ‌జెప్పినా ఎవ‌రూ మాటా విన‌లేదు. ఆఖ‌రికి మీడియా వాళ్లెవ‌రూ లేకుండానే ప్రెస్‌మీట్ కానిచ్చేశాడు. వ‌ర్మ కాస్త దిగి మీడియాకి సారీ చెబుతాడా..? లేదంటే ఇలానే యార‌గెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడా.. అన్న‌ది చూడాలి. వ‌ర్మ అనేకాదు.. ఆయ‌న శిష్యుల‌కూ మీడియా అంటే చుల‌క‌నే. కానీ త‌మ సినిమా ప్ర‌చారానికి మాత్రం మీడియా కావ‌ల్సివ‌స్తుంది. మ‌రి ఈ అభిప్రాయం ఎప్పుడు మార్చుకొంటారో, ఏమో..?

Exit mobile version