వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్‌ను అందించనుంది. ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఆదివారం ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇక ట్రైలర్ లో మాయాబజార్ అనే గేటెడ్ కమ్యూనిటిలో కుటుంబాలు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయనే విషయాన్ని కామెడీ కోణంలో చూపించారు. కొందరు పిల్లుల్ని పెంచుకుంటుంటారు, కొందరు ఆవులను పెంచుతుంటారు. ఓ ఇంటావిడైతే మొగుడిపై అనుమానంతో గొడవ పడుతూనే ఉంటుంది. కొందరు చాదస్తంగా మాట్లాడుతుంటారు. అయితే వీరందరు కలిసి ఉండే గేటెడ్ కమ్యూనిటీని ప్రభుత్వ అనుమతి లేని ప్రాంతంలో నిర్మించారని, ఈ కమ్యూనిటీలోని ఇళ్లను కూల్చి వేయాలని బుల్డోజర్స్‌తో అధికారులు వస్తారు. అప్పుడు ఏమవుతుంది. వారి గేటెడ్ కమ్యూనిటీని కాపాడుకున్నారా? అనేది తెలియాలంటే జూలై 14 వరకు ఆగాల్సిందే.
ఇకపోతే ‘మాయాబజార్ ఫర్ సేల్’ లో నరేష్ వి.కె, ఝాన్సీ, రాజా చెంబోలు, సునైన, అదితి, రవిరాజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.