Site icon TeluguMirchi.com

ధనుష్ నోట ‘మాస్టారూ మాస్టారూ’ పాట..


ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(వాతి). కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో కనువిందు చేశారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న భారీస్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రెండు భాషల్లోనూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.

ఇకపోతే ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్ కూడా అందరినీ ఎంతో అలరించాయి. ఈయన స్వరకల్పనలో రూపొందిన మెలోడియస్ లవ్ ట్రాక్ “మాస్టారూ మాస్టారూ” పాటకి శ్రోతల నుండి విశేష స్పందన వస్తుండగా, తాజాగా ఈ పాటను హీరో ధనుష్ స్వయంగా ఆలపించిన వెర్షన్ ను మేకర్స్ విడుదల చేశారు. కాగా ఒరిజినల్ వర్షన్ ని మించేలా ధనుష్ పాడిన ఈ పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది.

Mastaaru Mastaaru - Dhanush Reprise Version | Sir Songs | Samyuktha | Venky Atluri |GV Prakash Kumar

Exit mobile version