నేచురల్ స్టార్ నాని పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దసరా’. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, సముద్రఖని, ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
కాగా ఫిబ్రవరి 24న న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ‘దసరా’ స్పెషల్ అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీని భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. నాని 39వ పుట్టినరోజు సందర్భంగా ‘దసరా’ కు తెలుగు రాష్ట్రాల్లోని 39 కేంద్రాల్లో కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతీయ సినిమాలో తొలిసారి అతిపెద్ద కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్ అని అన్నారు. సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది మరియు విడుదల తేదీ వరకు ప్రతి రోజు థియేటర్లలో కటౌట్‌లను మారుస్తారంట. తరువాత, కౌంట్‌డౌన్ ఇన్‌స్టాలేషన్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
All set for the FIRST OF ITS KIND ACTIVATION for a movie countdown
Let us celebrate NATURAL STAR @NameisNani's 39th birthday at 39 Centres and start counting for #Dasara
Tomorrow from 4 PM onwards
#DasaraOnMarch30th pic.twitter.com/3bRWqpFiDH
— SLV Cinemas (@SLVCinemasOffl) February 23, 2023
ఇదే కాకుండా “గోదావరి ఖని చౌరస్తాలో రేపు ఉదయం పదకొండు గంటల నుండి నాని బర్త్ డే సెలెబ్రేషన్స్ అట్టహాసంగా జరగబోతున్నాయి. ఈ వేడుకలకు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల హాజరు కాబోతున్నారు. మరి నాచురల్ స్టార్ ఫాన్స్… గెట్ రెడీ టు పార్టిసిపేట్” అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు.
All Natural Star @NameisNani fans assemble
Celebrate the Star's birthday at the HEART OF #Dasara, Godavarikhani, with director @odela_srikanth
Come Join us tomorrow at Godavarakhani Chowrastha from 11 AM onwards
#DasaraOnMarch30th pic.twitter.com/8SxyqlkK4C
— SLV Cinemas (@SLVCinemasOffl) February 23, 2023