మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు నాల్గవ సారి వీరిద్దరూ కలసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకా ఫ్లోర్‌లపైకి వెళ్ళకముందే ప్రతి అనౌన్స్ మెంట్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించనున్న #RT4GM భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ సినిమాలో రవితేజ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు.
రవితేజ,సెల్వరాఘవన్, ఇంధూజ రవిచంద్రన్, ఇతర టీమ్ సభ్యులు, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. స్క్రిప్ట్‌ని అల్లు అరవింద్ మేకర్స్‌కి అందజేశారు. ముహూర్తం షాట్‌కు అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, వివి వినాయక్ క్లాప్ ఇచ్చారు. తొలి షాట్‌కి కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
ఇకపోతే #RT4GM వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు బిగిల్, మెర్సల్ తో పాటు తాజా సంచలనం ‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పని చేసిన అత్యంత ప్రతిభావంతుడైన సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు #RT4GM కి డీవోపీ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలియజేస్తారు.
With all the anticipation & hype from the announcements, #RT4GM pooja ceremony was conducted on an auspicious note
The much awaited project begins its shoot very soon
#RT4GMBlast
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand @selvaraghavan @Actress_Indhuja… pic.twitter.com/41IHrsE7C0
— Mythri Movie Makers (@MythriOfficial) October 26, 2023