గుమ్మడికాయ్ కొట్టేశారు

masalaబాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం బోల్‌బ‌చ్చన్‌. తెలుగులో మ‌సాలాగా వ‌స్తోంది. వెంక‌టేష్, రామ్ క‌థానాయ‌కులు. అంజ‌లి, షాజ‌న్ ప‌ద‌మ్‌సీ క‌థానాయిక‌లు. విజ‌య‌భాస్కర్ కె. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ‌నివారం వెంక‌టేష్‌, రామ్‌, అలీ, జ‌య ప్ర‌కాష్‌రెడ్డి, కోవై స‌ర‌ళ‌ల‌పై నానాక్‌రామ్ గుడాలోని రామానాయుడు స్టూడియోలో మ‌సాలా మ‌సాలా అనే గీతాన్ని తెర‌కెక్కించారు. శంక‌ర్ మాస్టర్ నృత్య రీతులు స‌మ‌కూర్చారు. ఈ పాట‌తో షూటింగ్ మొత్తం పూర్తయింది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని న‌వంబ‌రు 1న విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. అయితే ఓ వారం రోజులు ఆల‌స్యంగా అంటే… 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఇటీవలే విడుద‌ల‌య్యాయి.