మ‌సాలా రెడీ

masala movie first lookబాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం బోల్ బ‌చ్చన్‌. తెలుగులో మ‌సాలాగా రీమేక్ చేస్తున్నారు. వెంక‌టేష్‌, రామ్ క‌థానాయ‌కులు. కె.విజ‌య‌భాస్కర్ ద‌ర్శకుడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకొంది. ద‌స‌రాకి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామ‌నుకొన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల వ‌ల్ల కుద‌ర్లేదు. ఇప్పుడు విడుద‌ల తేదీ ఫిక్సయ్యింది. న‌వంబ‌రు 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. అక్టోబ‌రులో పాట‌ల్ని వినిపిస్తారు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అంజ‌లి, షాజ‌న్ ప‌ద‌మ్‌సీ క‌థానాయిక‌లుగా న‌టించారు. సురేష్‌బాబు, స్రవంతి ర‌వికిషోర్ నిర్మాత‌లు.