రాజమౌళి తన మార్క్ వదిలేసి.. వినోదాల బాట పట్టిన చిత్రం ‘మర్యాద రామన్న’. కథానాయకుడిగా సునీల్ ని మరో మెట్టు పైకి ఎక్కించింది. హిందీ, తమిళ భాషల్లో రీమేక్ రూపంలో వెళ్లింది. అక్కడా మంచి విజయాల్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జపనీస్ లో అనువదించి విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. వినోదాత్మక చిత్రాలకు జపాన్ లో మంచి గిరాకీ ఉంది. రజనీకాంత్ సినిమాలు అక్కడ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు రజనీ బాటలో రాజమౌళి సినిమా వెళ్తోందన్నమాట. అవర్ హాస్పిటాలిటీ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా రూపొందిచ చిత్రమిది. మరి జపాన్ లో రాజమౌళి మార్కు వినోదానికి ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.