శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్ హీరో హీరోయిన్లుగా వాణి. ఎమ్. కోసరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. శేఖర్‌చంద్ర సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ శ్రీ చైత్ర చలన చిత్ర బ్యానర్ లోగోని ఆవిష్కరించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ చిత్ర ఆడియోను హీరో నిఖిల్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కె. సురేష్‌బాబు, శ్రీనివాస్ వుడిగ లు మాట్లాడుతూ..’ ముందుగా మా ఆడియో ఫంక్షన్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఓర్పుతో సహకరించారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. భాస్కరభట్ల గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కర్ని ఎంతగానో ఇబ్బంది పెట్టి మరీ మంచి అవుట్‌పుట్ తీసుకున్నాము. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. అలాగే హీరో ప్రిన్స్, హీరోయిన్లు వ్యోమనంది, పూజా రామచంద్రన్‌లతో పాటు మా విలన్ సుజో మ్యాథ్యూ ఈ మూవీలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుని మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము…అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, హీరో రాహుల్ రవీంద్రన్, హీరో ఆశ్విన్, వ్యోమనంది, పూజా రామచంద్రన్, భాస్కరభట్ల, మార్తాండ్.కె. వెంకటేష్, కెమెరామెన్ రాజశేఖర్, విలన్ సుజో మ్యాథ్యూ తదితరులు పాల్గొన్నారు.
ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్, సుజో మ్యాథ్యూ, సమీర్, సన, రవివర్మ, పావనీ రెడ్డి, ఈ రోజుల్లో ఫేమ్ సాయి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఆర్ట్: పి.యస్. వర్మ, ఫైట్స్: సతీష్, కెమెరా: ఎస్. రాజశేఖర్, ఎడిటర్: మార్తాండ్. కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: కె. సురేష్‌బాబు, శ్రీనివాస్ వుడిగ, నిర్మాణం: శ్రీ చైత్ర చలన చిత్ర, కథ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: వాణి. ఎమ్. కోసరాజు.