Site icon TeluguMirchi.com

ఆది పినిశెట్టి అడ్వంచ‌ర్ ఘోస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ “మ‌ర‌క‌త‌మ‌ణి”

marakathamani

‘స‌రైనోడు’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో వైరం ధ‌నుష్ పాత్ర‌లో అంద‌రిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగ‌ర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం “మ‌ర‌క‌త‌మ‌ణి”. ఇటీవ‌లే ‘మ‌లుపు’ లాంటి కాన్సెప్టెడ్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గ‌ర్లాని మ‌రోక్క‌సారి జంట‌గా చేసిన‌ మ‌ర‌క‌త‌మ‌ణి యెక్క‌ మెద‌టి లుక్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుంద‌ని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మిళం లో రెండు సూప‌ర్‌ హిట్ చిత్రాల‌కి వ‌ర్క్ చేసిన A.R.K.శ‌ర్వ‌న‌ణ్ ద‌ర్శ‌కత్వం చేస్తున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. ” ‘స‌రైనోడు’ లాంటి సూప‌ర్‌బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం లో వైరం ధ‌నుష్ గా తిరుగులేని స్టైలిస్ పాత్ర‌లో అల‌రించిన ఆది పినిశెట్టి గారు హీరోగా నటించిన చిత్రం మ‌ర‌క‌త‌మ‌ణి. ఈ చిత్రం యోక్క ఫ‌స్ట్ లుక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌లుపు లాంటి సూప‌ర్ హిట్ చిత్రంలో జంట‌గా న‌టించిన ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని లు న‌టించిన ఈ చిత్రం చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుండ‌ట‌మే కాకుండా అడ్వంచ‌ర్ ఘెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ గా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం మార్చిలో విడుద‌ల కి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ఈ చిత్రానికి క‌బాలి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు సంతోష్ నారాయ‌ణ్ అసిస్టెంట్ దిబు థామ‌స్ తొలిసారిగా మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే క‌బాలి సింగ‌ర్ అనిల్ కామ‌రాజ్ ఈ చిత్రంలో న‌టించ‌టం తో పాటు ఓ సూప‌ర్ సాంగ్ పాడారు. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఓకేసారి విడుద‌ల చేస్తున్నాము. కొటా శ్రీనివాస‌రావు గారు ఓ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే సూప‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మ‌నందం గారు న‌వ్వులు కురిపించారు. ఈ చిత్రం అంద‌రిని స‌ర్‌ప్రైజ్ చేస్తుందన‌టంలో సందేహం లేదు.” అన్నారు.

న‌టీన‌టులు.. ఆదిపినిశెట్టి, నిక్కిగ‌ర్లాని, కొటాశ్రీనివాస‌రావు, బ్ర‌హ్మ‌నందం, ఆనంద్ రాజ్‌, అరుణ్ రాజ్‌, కామ‌రాజ్‌, రామ్‌దాస్ త‌దిత‌రులు న‌టించారు..

సంగీతం- దిబు నైన‌న్ థామ‌స్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.వి.శంక‌ర్‌, ఎడిట‌ర్‌- ప్ర‌స‌న్న.జి.కె, నిర్మాతలు- రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌, క‌థ‌,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- A.R.K.శ‌ర్వ‌న‌ణ్

Exit mobile version