మంచు మనోజ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా ?

మంచు మనోజ్‌ లో చాలా కోణాలు ఉనాయి. రచయితగా, గాయకుడిగా, స్టంట్స్‌మెన్‌గా తన ట్యాలెంట్ ను చూపించిన మనోజ్.. ఇప్పుడు సంగీత దర్శకుడిగా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. నటిగా, నిర్మాతగా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ఇప్పటికే లాస్‌వేగాస్, ఇ.ఆర్., డెస్పరేట్ హౌస్‌వైఫ్ లాంటి టెలివిజన్ సీరియల్స్‌తోపాటు హాలీవుడ్ సినిమాల్లో నటించింది. మళ్లీ చాలాకాలం తరువాత హాలీవుడ్ నిర్మాణ సంస్థలో నటిస్తున్న చిత్రం ‘బాస్మతి బ్లూస్’. డాన్‌ బారన్‌ దర్శకుడు. బ్రీ లార్సన్‌, ఉత్కర్ష్‌ అంబుద్కర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షౌట్‌ ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే, ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడిగా మారినట్లు మనోజ్‌ చెప్పాడు . స్నేహితుడు, ప్రముఖ సంగీత దర్శకుడు అచ్చు రాజమణి, అమెరికన్‌ రాక్‌ బ్యాండ్‌ పెరల్‌ జామ్‌తో కలిసి ఈ ప్రాజెక్టు కోసం పనిచేశానని చెప్పుకొచ్చాడు మనోజ్.