Site icon TeluguMirchi.com

షారుక్ ‘పేరడీ’ వివాదం

sharukవివాదాల్ని హాబీ గా చేసుకోవడం షారుక్ కు ఓ హాబిట్ గా మారింది. షారుక్ కు విజయలెన్నో అంతే రేంజ్ లో వివాదాలూవున్నాయి. తాజా గా షారుక్ కు మరో పాత కష్టం వచ్చి పడింది. అప్పుడెప్పుడో చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ బాడీ ని బాలీవుడ్ పరిచయం చేసిన ‘ఓం శాంతి ఓం’లో చిత్రంలో అలనాటి నటుడు మనోజ్ కుమార్ ను అనుకరిస్తూ చిత్రీకరించిన పేరడీ సన్నివేశాల్ని తొలిగించిన పిమ్మటే ఆ సినిమాను జపాన్ లో విడుదల చేయాలని అప్పట్లో షారూఖ్ కు పలుమార్లు సూచించినా షారుక్ వినుకోలేదు. అయితే షారూఖ్ ను ఇప్పటికి
రెండుసార్లు క్షమించానని, మరోసారి అతన్ని వదిలిపెట్టనని మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. షారూఖ్ తో పాటు వీడియో సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ పై రూ. 100 కోట్ల మేర పరువు నష్టం కోరుతూ సివిల్, క్రిమినల్ కేసులు
వేయబోతున్నట్టు మనోజ్ కుమార్ తెలిపాడు. చిత్ర ప్రింట్లు, ప్రసార కాపీల నుంచి పేరడీ సీన్లు తొలగించాలని 2008లోనే కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, షారూఖ్ కోర్టు ధిక్కారానికి కూడా పాల్పడ్డట్టయిందని, మరో సారి కోర్టు చుట్టూ షారుక్ తిరగాల్సిందేనని మనోజ్ కుమార్ అన్నాడు.

Exit mobile version