దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 5న దేశ వ్యాప్తంగా ప్రజలంతా దీపాలు వెలిగించాలని కోరారు. ఈ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం (ఏప్రిల్ 5న) రాత్రి 9 గంటలకు విద్యుత్ బల్బులను ఆపివేసి.. దీపాలను, టార్చ్‌లను వెలిగించారు. కొంతమంది ఆకతాయిలు మాత్రం పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈ బాణాసంచా కాల్చడం వల్ల జరిగిన భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీని పట్ల చాలామంది విమర్శలు చేస్తున్నారు.
హీరో మంచు మనోజ్ సైతం ఆకతాయిలు చేసిన పని పట్ల ఫైర్ అయ్యాడు. బాణాసంచా కాల్చడం వల్ల జరిగిన భారీ అగ్ని ప్రమాదాల వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేస్తూ ఇలాంటి పనుల్ని చేసే వాళ్లని తనదైన శైలిలో ఏకిపారేశారు మంచు మనోజ్. ‘ఈ క్రాకర్స్ చూస్తే.. మనవాళ్లు కరోనాని కూడా సీఎం లేదా పీఎం చేస్తారనుకుంటా.. ఓరి దీనమ్మా బతుకు.. మళ్లీ జై కరోనా అంట’ అంటూ ఫైర్ అవుతూ ట్వీట్ వదిలారు.
‘రేయ్ ఇడియట్స్.. ఆ క్రాకర్స్ కాల్చడం ఆపండ్రా.. మనం మనుషులే తప్ప మూర్ఖులం కాదు.. క్రాకర్స్ కాల్చమని మిమ్మల్ని ఎవరూ అడగలేదు.. జి బలిసిన చదువుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు’ అంటూ క్రాకర్స్ కాల్చిన వాళ్లకు చురకలు వేశారు హీరో మంచు మనోజ్.
Massive fire in a building in my neighborhood from bursting crackers for #9baje9mintues. Fire brigade just drove in. Hope everyone's safe. pic.twitter.com/NcyDxYdeFW
— Mahim Pratap Singh (@mayhempsingh) April 5, 2020
Idiots stop bursting crackers ?? no one asked u too … I’m sure only G balisina educated lot r doing this …. please guys ?? let’s be humans and not morons ??????????
— MM*??❤️ (@HeroManoj1) April 5, 2020