Site icon TeluguMirchi.com

పోటుగాడు ఫీల‌య్యాడు

manchu manojఎప్పుడూ స‌ర‌దాగా ఉండే మంచు మ‌నోజ్‌కీ కోపం ప‌డ‌గ‌లెత్తింది. ఆ కోపం కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా వెనుకాడ‌లేదు. అస‌లేం జ‌రిగిందంటే.. పోటుగాడు ట్రైట‌ర్స్‌, పాట‌లూ యూ ట్యూబ్‌కి ఎక్కాయి. అయితే అవి అధికారికంగా ఇచ్చిన‌వి కాదు. ఆదిత్య మ్యూజిక్ సంస్థకు పోటుగాడు ట్రైల‌ర్ డ‌మ్మీ ఇచ్చారు. అవి మూడో వ్యక్తి ద్వారా యూ ట్యూబ్ లోకి వ‌చ్చేశాయి. అవి చూసి మ‌నోజ్ షాక్ తిన్నాడు. “ఇలా ఎందుకు జ‌రిగిందో అర్థం కావ‌డం లేదు. మేమెంతో క‌ష్టప‌డి సినిమాలు చేస్తాం. దొడ్డి దారుల్లో వాటిని యూ ట్యూబ్‌లో పెట్టేస్తే ఎలా? నేను నిర్మాత‌ను కాదు కాబ‌ట్టి స‌రిపోయింది, లేదంటే కోర్టుకు వెళ్దును“ అంటూ తెగ సీరియ‌స్ అయిపోయాడు మ‌నోజ్‌.

Exit mobile version