Site icon TeluguMirchi.com

మన్నాడే ఇక లేరు

mannadeyప్రముఖ గాయకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (గురువారం) తెల్లవారుజామున కన్నుమూశారు.

వైవిధ్యం భరితమైన తన మెలోడి గాత్రం తో భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన మన్నాడే 1919 మే 1 న కోల్‌కతాలోజన్మించారు. 1942లో ముంబయి వచ్చిన మన్నాడే ఎస్ డి బర్మన్ , సి. రామచంద్ర దగ్గర అసిస్టెంట్‌గా చేరి సంగీత మెలుకువలు నేర్చుకున్నారు. ‘తమన్నా’ చిత్రంతో నేపథ్యగాయకుడిగా మారిన మన్నాడే.. షోలే, పడోసన్, మేరానామ్ జోకర్, బర్సాత్‌కీ ఏక్ రాత్, సఫర్, సాఖీ, జ్యోతి, అనిత, పతి పత్ని ఔర్ ఓ, వక్త్, ఉపకార్, బాబీ, ఆనంద్ తదితర అసంఖ్యాకమైన చిత్రాల్లో హిట్ పాటలెన్నో పాడారు.

సంగీత ప్రపంచం లో అద్భుతమైన వైవిధ్యం కనబరిచిన ఆయన్ను దేశం దాదా సాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ, పద్మభూషణ్‌లు ఆవార్డులతో సత్కరించింది. ఇక ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అభివర్ణించింది.

Exit mobile version