తిక్క వ్యాఖ్యల వల్ల నెటిజన్‌పై మండిపడ్డ చైతూ హీరోయిన్‌

నాగచైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మంజిమ మోహన్‌ తాజాగా నెటిజన్‌కు గట్టిగా క్లాస్‌ పీకింది. త తిక్కగా మాట్లాడడంతో మంజిమ అతడిపై మండిపడిరది. కురచ దుస్తుల్లో ఉన్న హీరోయిన్‌ను చూడడానికే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని నెటిజన్‌ వ్యాఖ్యానించగా మంజిమ అతడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

కేవలం హీరోయిన్ల అందాలను కురచ దుస్తుల్లో చూడడానికి ప్రేక్షకులు సినిమాకు వస్తారు అనేది నీ తప్పుడు అభిప్రాయం, మంచి సినిమాలను ఆస్వాదించడానికి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. నీ ఆలోచనలు చాలా తప్పుగా ఉన్నాయి. హీరోయిన్లను కురచ దుస్తుల్లో చూడడానికి మాత్రమే వస్తారు అనేది ముమ్మాటికి తప్పుడు అభిప్రాయమే అంటూ మంజిమ తేల్చి చెప్పింది.