Site icon TeluguMirchi.com

కొత్త గెట‌ప్పుల కోసం…

potugaduర‌కర‌కాల గెట‌ప్పుల్లో క‌నిపించాలంటే మంచు మ‌నోజ్‌కి చాలా ఇష్టంలా ఉంది. మిస్టర్ నూక‌య్య‌, ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారా సినిమాల్లో ఆ గెట‌ప్పుల ముచ్చట తీర్చుకొన్నాడు… మంచు వారి అబ్బాయి. ఇప్పుడు పోటుగాడులోనూ కొత్తర‌కంగా క‌నిపిస్తాడ‌ట‌. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. పోటుగాడులో మ‌నోజ్ పాత్ర రెండు రకాలుగా ఉండ‌బోతోంది. అంటే.. రెండు ర‌కాల ఆకారాల్లో క‌నిపిస్తాడ‌న్నమాట‌. అంతేకాదు.. మంచు వారి మ‌ల్టీస్టార‌ర్‌లోనూ మ‌నోజ్‌కి కొత్త గెట‌ప్పుల్లో చూడొచ్చు. పోటుగాడు కోసం బ‌రువు త‌గ్గిన మ‌నోజ్ మ‌ల్టీస్టార‌ర్ కోసం త‌గ్గుతున్నాడు! అంతే కాదు.. కొత్తర‌క‌మైన విగ్గు కూడా త‌యారు చేయిస్తున్నాడ‌ట‌. మ‌రి ఆ గెటప్ ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ అండ్ సీ.

Exit mobile version