Site icon TeluguMirchi.com

బృహ‌న్నల‌కాదు.. పోలీస్

manchu-manoj-in-panadvulu-pమంచు వారి మ‌ల్టీస్టార‌ర్ పాండ‌వులూ, పాండువులూ తుమ్మెద సినిమాలో మంచు మ‌నోజ్ బృహ‌న్నల‌గా క‌నిపించ‌బోతున్నాడా? గ‌త కొన్ని రోజులుగా చ‌క్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మ‌నోజ్ చీర క‌డ‌తార‌ని, సిగ్గులు ఒల‌క‌బోస్తార‌ని చెప్పుకొన్నారు. అయితే ఈ సినిమాలో మ‌నోజ్ బృహ‌న్నల‌గా కాద‌ట‌.. పోలీస్ గా మురిపిస్తార‌ట‌. ఇందుకు సంబంధించిన ఓ స్టిల్ మ‌నోజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “నేను బృహ‌న్నల కాదు… ఆ వార్తల్లో నిజం లేదు..“ అని మ‌నోజ్ స్పష్టం చేశారు మ‌నోజ్‌. ఆయ‌న ఖాకీ క‌ట్టడం ఇదే తొలిసారి. మ‌రి ఈ సినిమాలో ఇదో గెట‌ప్పో, లేదంటే సీరియస్‌గానే పోలీస్ వేషం వేశారో తెలియాలంటే ఆ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఆగాలి.

Exit mobile version