Site icon TeluguMirchi.com

విష్ణు ఖాతాలో మ‌రోటి

vishnuసినిమా త‌ర‌వాత సినిమాని ప‌ట్టాలెక్కిస్తూ బిజీగా ఉంటున్నాడు మంచు విష్ణు. ప్ర‌స్తుతం రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకొంది. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా చేరింది. త‌మిళ నాట ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం మంజ‌పాయ్‌. ఈ సినిమా హ‌క్కుల్ని దాస‌రి నారాయ‌ణ‌రావు సొంతం చేసుకొన్నారు. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. క‌థానాయ‌కుడిగా విష్ణుని ఎంచుకొన్నారు. ప్ర‌స్తుతం స్ర్కిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలుస్తాయి. ఇందులో కీల‌క పాత్ర‌లో దాస‌రి కూడా క‌నిపించే అవ‌కాశం ఉంది.

Exit mobile version