అన్నలకు చివరిదాకా తోడుంటా..

పొలిట్‌ బ్యూరో సభ్యుడు హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో హరికృష్ణ కుమారులు తారక్‌, కల్యాణ్‌ రామ్‌లు కన్నీరుమున్నీరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మనోజ్‌ వారు అలా ఏడవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని అన్నారు. నిన్న హరికృష్ణ గారి అంతిమ యాత్ర మొదలుకొని అంత్యక్రియలు అయ్యిపోయే వరకు మంచు మనోజ్ తారక్‌, కల్యాణ్‌ రామ్‌ లకు తోడుగా ఉన్నాడు.

తారక్‌, కల్యాణ్‌రామ్‌ అన్నను, వారి కుటుంబాన్ని అలా చూస్తుంటే గుండెపగిలిపోతోంది. దేవుడు నిజంగానే కఠినాత్ముడు. హరికృష్ణగారి మృతి నుంచి ఆ కుటుంబం తేరుకునేలా వారికి శక్తిని ప్రసాదించాల్సిందిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. చివరిదాకా ఆ కుటుంబం కోసం నేనుంటాను. తన పుట్టినరోజు కోసం ఖర్చు పెట్టే డబ్బును కేరళ వరద బాధితులకు సాయంగా ప్రకటించాలన్న హరికృష్ణ చివరి కోరికను మనం నెరవేరుద్దాం. రూ.5 లక్షలు విరాళం ఇచ్చి నేను నా వంతు సాయం చేశాను. నందమూరి, తెలుగు చిత్రపరిశ్రమ అభిమానులు కూడా తమ వంతు సాయం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు మనోజ్‌.