షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌తో మంచు హీరో

దాదాపు రెండు సంవత్సరాలుగా మంచు హీరో మనోజ్‌ కెమెరాకు దూరంగా ఉంటున్నాడు. ఈయన అంతకు ముందు చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో ఎన్నో వార్తలు వచ్చాయి. మనోజ్‌ ఇక సినిమాల్లో నటించడు అనే వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి మళ్లీ మంచు మనోజ్‌ వెండి తెరపై కనిపించేందుకు సిద్దం అయ్యాడు. గ్యాప్‌ తీసుకున్న కారణంగా లావు అయిన మనోజ్‌ ఇటీవల వర్కౌట్స్‌ చేసి సన్నబడ్డాడు.

ఇటీవలే మనోజ్‌ కొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్య పర్చాడు. త్వరలో సినిమా ఉంటుందని చెప్పిన మంచు మనోజ్‌ తాజాగా ఆ విషయమై మరింత క్లారిటీ ఇచ్చాడు. షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు మంచు మనోజ్‌ రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సినిమాను నిర్మించేది ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు. చిన్న బడ్జెట్‌తో కాన్సెప్ట్‌ బేస్డ్‌ కథాంశంతో సినిమాను చేయాలని మంచు మనోజ్‌ నిర్ణయించుకున్నాడు.