శ్రీలంక ఎల్టీటీఈ మిలిటెంట్ ప్రభాకరన్ పాత్రను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో మంచు మనోజ్ ఎలా ఉండబోతున్నాడు అనేది రెండు మూవీ స్టిల్స్ విడుదల చేశారు. షాకింగ్లుక్లో మనోజ్ కనిపించాడు. భారీగా బాడీ పెంచి, నిజమైన ఎల్టీటీఈ తీవ్రవాది ఉన్నట్లుగానే మనోజ్ ఉన్నాడు అనే టాక్ వినిపిస్తుంది.
ఈ చిత్రం కోసం మంచు మనోజ్ రెండు విభిన్న పాత్రల్లో కనించనున్నాడు. రెండు పాత్రలకు చాలా తేడా ఉంటుంది. పైన మీరు చూస్తున్న పాత్ర కంటే మరో పాత్రలో మనోజ్ దాదాపు 12 కేజీలు బరువు తగ్గి కనబపడున్నాడు. ఈ చిత్రం కోసం మనోజ్ చాలా కష్టపడుతున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.