Site icon TeluguMirchi.com

డైరెక్షన్ లో వేలు పెట్టక తప్పట్లేదు !

manoj-potugaduసినిమా బావుండాలనే కోరిక బలంగా వున్నప్పుడు దర్సకత్వంలో జోక్యం చేసుకుంటే తప్పేంటి ? అని ప్రశ్నిస్తున్నారు యువ హీరో మంచు మనోజ్. కొంతమంది దర్శకులు కథ బాగా చెబుతారు. కాని వాటిని తెరపై ఆవిష్కరించటంలో తడబడుతుంటారు. అలాంటప్పుడు దర్సకత్వంలో వేలు పెట్టక తప్పదు కదా ? అంటున్నారాయన. సినిమా అన్నది ఎవడి సొత్తూ కాదు. సినిమా విజయం అనేది ఉమ్మడి కృషి ఫలితం. ఎన్నో జీవితాలు సినిమా సక్సెస్ మిద ఆధార పడివుంటాయి. అలాంటప్పుడు నేను గిరి గీసుకుని ఉండలేను. నాణ్యత కోసం దర్సకత్వపు పనిలో జోక్యం చేసుకోవటం, సలహాలనివ్వటం తప్పేమీ కాదు అంటున్న మనోజ్ హీరోగా నటించిన ” పోటుగాడు ” సినిమా శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, శిరీష లు నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ గా ఇప్పటికే టేబిల్ ప్రాఫిట్ తో విడుదల కానుండటం విశేషం. మార్కెట్లో ” పోటుగాడు ” పాటలు బాగానే సందడి చేస్తున్నాయి. త్వరలోనే దర్సకత్వం చేస్తాననీ, తన సినిమాల బడ్జెట్ విషయంలో తాను చాలా ఖండితంగా ఉంటానని, మంచి కధతో తన వద్దకు వచ్చిన వ్యక్తి కొత్త దర్సకుడయినా సరే అతడికి అవకాశం ఇస్తానని మనోజ్ చెబుతున్నారు.

Exit mobile version