కలెక్షన్ కింగ్ మోహాన్‌బాబు కూతురుగా రంగ ప్రవేశం చేసి అనంతరం అనేక భాద్యతలను నిర్వహించిన మంచులక్ష్మి తాజాగా తిరుమల శ్రీవారి దర్శణానికి వెళ్లింది. కేవలం తన భర్తతో మాత్రమే కాకుండా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా తనవెంట బెట్టుకుని మరీ తిరుమల వెళ్లింది. తిరుమలలో శ్రీవారి దర్శణం తర్వాత లక్ష్మి చాలా అతి చేసింది. సెలబ్రిటీ వచ్చిందని మీడియా వారు కాస్త ఉత్సాహం చూపగా లక్ష్మి వారిపై ఫైర్ అయ్యింది. స్థానికులు కూడా లక్ష్మిని చూడడానికి ముచ్చటపడ్డారు. కానీ ఈ అమ్మడు మాత్రం చాలా సీరియస్ అయ్యింది.
మీకు దండం పెడతాను మమ్మల్ని వదలండి ప్లీజ్ అంటూ వేడుకుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి తనని తోశాడని అడిగి మరీ క్షమాపణలు చెప్పించుకుంది. అంతేకాకుండా ఆడాళ్లపై ఇలా పడుతున్నారు కాస్త కూడా పద్దతి తెలియదా అంటూ తిరుమలలో మంచు లక్ష్మి చాలా రచ్చ చేసింది. క్ష్మి ఏది చేసినా కూడా పెద్ద సంచలనం కోసమే చేస్తూ ఉంటుంది. భవుశా ఇది కూడా సంచలనం కోసమే అతి చేసింది అని సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా ప్రమోషన్‌కు మీడియా కావాలి కానీ ఇలాంటి వాటికి వారు అవసరం లేదా అంటూ మీడియా వర్గాల వారు కూడా మంచులక్ష్మిపై నిప్పులు చెరుగుతున్నారు.