హీరో, హీరోయిన్ ఫేస్ కనిపించకుండా, ఫ్యాషన్ డిజైనర్ అనేందుకు సింబాలిక్‌గా అమ్మాయి కొలతలు తీసుకుంటూ హీరోను సగం వరకు చూపించారు. ఈ ఫస్ట్‌లుక్ కొందరిలో ఆసక్తి కలిగించగా, మరి కొందరు మాత్రం ఈ లుక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ లుక్‌పై మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలా ఇంకా ఎంత కాలం ఆడవారిని చూపిస్తారు అంటూ మధుర శ్రీధర్ పోస్ట్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు రీ ట్వీట్ చేసింది. ఆమె రీ ట్వీట్‌కు అనూహ్య స్పందన వస్తుంది.