ఫ్యాషన్‌ డిజైనర్‌పై మంచు వారి అమ్మాయి తీవ్ర ఆగ్రహం

fation deasigenerవంశీ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా దాదాపు 30 సంవత్సరాల క్రితం వచ్చిన ‘లేడీస్‌ టైలర్‌’ ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లకు అదే దర్శకుడు ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు. ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ పేరుతో వంశీ ఈ సీక్వెల్‌ను చేస్తున్నాడు. భారీ అంచనాలు, ఆసక్తి ఉన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా మధుర శ్రీధర్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది.

హీరో, హీరోయిన్‌ ఫేస్‌ కనిపించకుండా, ఫ్యాషన్‌ డిజైనర్‌ అనేందుకు సింబాలిక్‌గా అమ్మాయి కొలతలు తీసుకుంటూ హీరోను సగం వరకు చూపించారు. ఈ ఫస్ట్‌లుక్‌ కొందరిలో ఆసక్తి కలిగించగా, మరి కొందరు మాత్రం ఈ లుక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ లుక్‌పై మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలా ఇంకా ఎంత కాలం ఆడవారిని చూపిస్తారు అంటూ మధుర శ్రీధర్‌ పోస్ట్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు రీ ట్వీట్‌ చేసింది. ఆమె రీ ట్వీట్‌కు అనూహ్య స్పందన వస్తుంది.fation deasigener s