హీరో అన్నమాటేగానీ, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్, గీత రచయిత, గాయకుడు ఇలా అనేక రకాలైన అవతారాలు ఎత్తుతుంటాడు మంచు మనోజ్. దర్శకుడి విషయంలోనూ జోక్యం చేసుకొంటాడని.. ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు. వేలూ, కాల్లూ పెట్టడం ఏమిటి..? ఇప్పుడు నిజంగానే దర్శకుడిగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడు మనోజ్. త్వరలో ఓ సినిమాకి దర్శకత్వం వహించే ప్రయత్నాలు చేస్తున్నాడు. నిర్మాత కూడా ఆయనేనట. కొత్తవారితో ఓ సినిమా తీసి తనని తాను దర్శకుడిగా కూడా నిరూపించుకోవాలనుకొంటున్నాడు మనోజ్. ప్రస్తుతానికి కథలు సిద్దం చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నాడట. మరి మనోజ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా??