వావ్.. హీరోయిన్ కేసు గెలిపించిన హీరో

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి చాలా మందికి ఒక విషయం తెలీదు. ఆయన లా చదివారు. ఆయన కెరీర్ ప్రారభించింది అడ్వకేట్‌గానే. సినిమాలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టారు.

అయితే చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ నల్లకోటు ధరించారు. ఓ హీరోయిన్ కేసును వాదించారు. ఆ హీరోయిన్ పేరు ఇంద్రజ. వివరాల్లోకి వెళితే.. ఇంద్రజకు తన మేనేజర్‌తో నగదు లావాదేవీలకు సంబంధించి వివాదం ఏర్పడింది. దీంతో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా కోర్టులో కేసు నడుస్తోంది.

ఇటీవల మమ్ముట్టి ఈ విషయం తెలుసుకుని కోర్టులో ఇంద్రజ తరఫున కేసు వాదించాలని నిర్ణయించుకున్నారు. చాలా రోజుల తర్వాత న్యాయవాదిగా కోర్టు మెట్లు ఎక్కి ఇంద్రజ వైపు వాదించి కేసు గెలిచారు. తనలోని లా ప్రతిభను బయటపెట్టి న మమ్ముటి పై ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రసంసల జల్లు కురుస్తుంది.