‘శాకుంతలం’ నుండి బ్యూటిఫుల్ సాంగ్..


సమంత టైటిల్‌ పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏప్రిల్‌ 14న విడుదల కానున్న ఈ చిత్రంలోని…
“మల్లికా మల్లికా మాలతీ మాలికా
చూడవా చూడవా ఏడినా ఏలికా,
హంసికా హంసికా జాగులే చేయక
పోయిరా పోయిరా రాజుతో రాయికా,
అతనితో కానుకా ఈయనా నేనికా
వలపుకే నేడొక వేడుకే కాదా…” అంటూ సాగే పాటను శుక్రవారం విడుదల చేశారు. చైతన్య ప్రసాద్‌ అందించిన సాహిత్యం అద్భుతంగా కుదిరింది. మణిశర్మ కూర్చిన బాణీకి అందంగా న్యాయం చేశారు సింగర్‌ రమ్య బెహరా. పాట వింటున్నప్పుడు ఎంత శ్రావ్యంగా అనిపించిందో, స్క్రీన్‌ మీద చూసినప్పుడు అంతే ఇంపుగా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లిక మల్లిక పాట విజువల్‌ ఫీస్ట్ అని చెప్పవచ్చు.