టాప్ డైరెక్టర్ చేతులో అల్లు శిరీష్..?

allu-sirish-marriage-fixమెగా హీరో లలో ఒకడైన అల్లు శిరీష్ ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కానీ సక్సెస్ మాత్రం అతడిని తలుపు తట్టలేదు. దీంతో ‘శ్రీరస్తు శుభమస్తు’ అంటూ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సోలో ఫేమ్ పరుశురాం తెరకెక్కించిన ఈ చిత్రానికి భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి అంచనాలు అందుకోవడం లో శిరీష్ ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది పక్కన పెడితే , తాజాగా ఈ మెగా హీరోకి మలయాళ టాప్ డైరెక్టర్ ఓ ఛాన్స్ ఇవ్వబోతున్నాడని న్యూస్ మెగా క్యాంపు లో ప్రచారం జరుగుతుంది. కాకపోతే ఆ డైరెక్టర్ కు ఒకే చెప్పాలా లేదా అనే ఆలోచనలో శిరీష్ ఉన్నాడట. ‘శ్రీరస్తు శుభమస్తు’ రిజల్ట్ బట్టి మలయాళ డైరెక్టర్ కు ఒకే చెపుతాడనే వార్త వినపడుతుంది.