Site icon TeluguMirchi.com

‘ఆదిపురుష్’ నుండి సాలిడ్ అప్డేట్..


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కథానాయికగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కగా, ప్రభాస్ రామునిగా కృతి సనన్ సీతగా నటించారు. ఇటీవ‌లే క‌శ్మీర్ లోని వైష్ణోదేవి టెంపుల్ ని ద‌ర్శించి సినిమా ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించిన మేక‌ర్స్ ఆ త‌రువాత శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా ప్ర‌త్యేక పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు.

తాజాగా ఏప్రిల్ 6 గురువారం హ‌నుమాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని `శ్రీ‌రామ‌ భ‌క్తుడు, రామాయ‌ణానికి ప్రాణం.. జై ప‌వ‌న‌పుత్ర హ‌నుమాన్‌.. జై భ‌జ‌రంగ‌బ‌లి` అంటూ కొత్త‌ పోస్ట‌ర్ ని ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ అభిమానుల‌తో పంచుకున్నారు.

ఈ పోస్టర్ లో హ‌నుమాన్ ధ్యానం చేస్తూ ఉండ‌గావెన‌కాల కిర‌ణాల మ‌ధ్య శ్రీ‌రాముడిగా ప్ర‌భాస్ షాడో క‌నిపిస్తున్న తీరు అభిమానుల్ని, సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఇక తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో జూన్ 16న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

Exit mobile version