20 యేళ్ల మేజ‌ర్‌ చంద్రకాంత్

Major-Chandrakanthసినిమాలు వ‌స్తుంటాయ్, పోతుంటాయ్‌. ఓసినిమాని ఏళ్లు గడిచినా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొన్నామంటే, అందులోని పాట‌ల్ని, సన్నివేశాల‌నూ మ‌న‌నం చేసుకొంటున్నామంటే క‌చ్చితంగా చిర‌స్థాయిలో నిలిచిపోయే సినిమానే అయ్యిండాలి. అందులో ఏదో ఓ గొప్ప సంగ‌తి… ప్రేక్షకుల్ని క‌ట్టిప‌డేసి ఉండాలి. అలాంటి సినిమాల్లో ఒక‌టి… మేజ‌ర్ చంద్రకాంత్‌. ఈ సినిమా పేరు గుర్తుకురాగానే.. అందులోని పుణ్య భూమి నాదేశం న‌మెన‌మామి… పాట‌, ఆ పాట‌లో ఎన్టీఆర్ వేసిన గెట‌ప్పులూ త‌ప్పకుండా స్రృతిప‌థంలో మెదులుతాయి. మోహ‌న్‌ బాబు-ఎన్టీఆర్‌ ల అనుబంధానికి ఈ సినిమా ఓ తీపి గురుతు. అలాంటి మేజ‌ర్ చంద్రకాంత్ వ‌చ్చి… నేటితో 20 యేళ్లు. మేజ‌ర్‌గా ఎన్టీఆర్ న‌ట‌న‌. మోహ‌న్ బాబు అల్లరి, ర‌మ్యకృష్ణ‌, నగ్మాల అంద‌చందాలూ, కీర‌వాణి పాట‌లూ…. వీట‌న్నింటితో పాటు రాఘ‌వేంద్రుడి ద‌ర్శక‌త్వ ప్రతిభ‌కు ఈ సినిమా నిలువెత్తు నిద‌ర్శనం. 20 కాదు క‌దా… మ‌రో 30 యేళ్లు సాగినా… ఈ సినిమా తెలుగువాడి స్ర్మతిప‌థం నుంచి చెరిగిపోదు.