ఇండియన్ సినీ స్టార్లలో ఉన్న అత్యంత హ్యాండ్సమ్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన అందానికి ఫిదా కాని హీరోయిన్ లు, హీరోలు, అమ్మాయిలు లేరు. ఆయన అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. నాలుగు పదులు దాటి మరో మూడేళ్లలో 50లోకి ఎంటర్ కాబోతున్నారు. నెంబర్ మారుతుందే కానీ మహేష్ ఏజ్ మాత్రం పెరగడం లేదు. రోజు రోజుకీ తగ్గుదోంది. వయసు పెరుగుతున్నా ఆయన అందం పెరుగుతూ వస్తోంది. ఎక్కడా గ్లో తగ్గడం లేదు.
తనయుడు గౌతమ్‌తో కలిసి పక్క పక్కనే నిలబడినా ఇద్దరు తండ్రీ కొడుకులుగా మాత్రం కనిపించడం లేదు.. అన్నాదమ్ములుగా కనబడుతున్నారు. అంతటి అందం మహేష్ సొంతం. అసలు ఎలా అన్నా ఇలా మెయింటైన్ చేస్తున్నావ్ అంటే.. చిత్తశుద్ధి అని చెప్తాడు మహేష్. జిమ్, డైట్ అస్సలు మానడు. ఇక తాజాగా ఒట్టో బ్రాండ్ షర్ట్స్ కోసం జరిగిన ఫోటోషూట్ లో మహేష్ పాల్గొన్నాడు. ఆ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఆ ఫొటోలు చూసిన వారంతా ఏజ్ పెరుగుతోంది..దాంతో పాటు అందం కూడా పెరుగుతోందని కామెంట్ లు చేస్తున్నారు.
Life in luxury! #Otto pic.twitter.com/aSiJUTWVTT
— Mahesh Babu (@urstrulyMahesh) April 6, 2023