Site icon TeluguMirchi.com

ఆ హీరో మ‌హేష్‌బాబేన‌ట‌

maheshరాణి రుద్రమ కోసం భారీ స్టార్ కాస్టింగ్‌ని రంగంలోకి దింపుతున్నారు గుణ‌శేఖ‌ర్‌. త‌న సినిమాకి కొత్త కొత్త సొబ‌గులు, ప్రత్యేక‌త‌లూ తీసుకొచ్చి ప్రేక్షకుల దృష్టి త‌న సినిమాపై ప‌డేలా చూసుకొంటున్నారు. ఇప్పుడాయ‌న మ‌హేష్‌బాబుని కూడా రంగంలోకి దింపేశారు. రాణి రుద్రమ‌లో ఓ యువ‌రాజు పాత్ర ఉంది. ఆ పాత్ర మ‌హేష్‌తో చేయించార‌ట గుణ‌శేఖ‌ర్‌. ఇటీవ‌లే ఆ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిగిపోయింద‌ట‌. ఈ పాత్ర కేవ‌లం రెండు, మూడు నిమిషాల పాటే తెర‌పై క‌నిపిస్తుంద‌ని.. కానీ ప్రేక్షకుల్ని ఓ థ్రిల్‌కి గురిచేసేలా ఉంటుంద‌ని తెలిసింది. మ‌హేష్‌బాబు రంగ ప్రవేశంతో ఈ సినిమాకి కొత్త ఊపు వ‌చ్చింది. తెర‌పై ప్రిన్స్‌… నిజ‌మైన ప్రిన్స్‌లా ఎంతిలా మెప్పిస్తాడో చూడాలి.

Exit mobile version