సీత‌మ్మ వాకిట్లో.. మళ్లీ మ‌హేష్ బాబు!

maheshచిన్నోడుగా సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుతో మురిపించాడు మ‌హేష్ బాబు. ఆ సినిమా చేస్తున్నప్పుడే ద‌ర్శకుడిగా శ్రీ‌కాంత్ అడ్డాల స్టైల్ మ‌హేష్‌కి బాగా న‌చ్చింది. అందుకే మ‌రోసారి శ్రీకాంత్ అడ్డాల‌తో జత క‌ట్టడానికి ప్రిన్స్ ప‌చ్చ జెండా ఊపేశాడు. సీత‌మ్మ వాకిట్లో.. త‌ర‌వాత శ్రీ‌కాంత్ అడ్డాల కథ ప‌ట్టుకొని చాలామంది హీరోల వెనుక తిరిగాడు. ఆ జాబితాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నాడు. ఈ హీరోలంతా త‌చ్చాడుతుంటే.. మ‌హేష్ నుంచి శ్రీ‌కాంత్‌కి పిలుపొచ్చింది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మ‌హేష్‌తో ఈ సంస్థ తెర‌కెక్కిస్తున్న 4వ చిత్రమిది.