తెలుగు బిగ్‌బాస్ 3 లో సరదా కంటెస్టెంట్ అయిన మహేష్ విట్టా అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ప్రస్తుతం సేఫ్ జోన్లో ఉన్నాడు. మొదటి నుండి ఎలిమినేషన్‌కు నామినేషన్లో ఉన్నా కూడా సునాయాసంగా సేవ్ అవుతూ ప్రస్తుతం స్ట్రాంగ్ అవుతున్నాడు. మహేష్ ప్రవర్తన, టాస్క్‌లలో చూపే ప్రతిభని బట్టే బిగ్‌బాస్ ఇంట్లో మహేష్ ఉండాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ తాజా సమాచారాన్ని బట్టి మహేష్ బిగ్‌బాస్ ఇంట్లో నుండి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. స్ట్రాంగ్‌గా ఉండే మహేష్‌కు ఏమయింది, ఇంట్లోంచి బయటకు రావడానికి గల పరిణామాలు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.
మహేష్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి సూట్ కేస్‌లో బట్టలను సర్దుకోమని చెబుతాడు. అంతేకాకుండా ఇంటి సభ్యులందరికి కూడా బై చెప్పమని ఆదేశిస్తాడు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు మహేష్ ప్యాకప్ అయి మెయిన్ గేట్ వరకు వస్తాడు. ఇంట్లో సభ్యులంతా కూడా ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉంటారు. బాబా భాస్కర్ మహేష్‌ని ఏం జరిగింది అని అడగగా, నేనేం బాధ పడడం లేదు మాష్టర్ అంటూ చాలా సింపుల్‌గా బై చెబుతాడు. అయితే ఇదంతా సీక్రెట్ టాస్క్‌లో భాగమా? లేక మరేదైనా కారణంతో మహేష్ విట్టా బిగ్‌బాస్ ఇంట్లో నుండి ఔట్ అయ్యాడా? అనేది ఆసక్తికరంగా మారింది.