తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 పదవ వారంలో కెప్టెన్సీ టాస్క్ విజయవంతంగా పూర్తయింది. ఈ వారం బిగ్‌బాస్ కాలేజ్ టాస్క్‌లో భాగంగా బెస్ట్ ఫెర్ఫార్మెర్గా టీజర్ల నుండి బాబా భాస్కర్, స్టూడెంట్ల నుండి మహేష్ విట్టాలు ఎంపికయ్యారు. ఈ ఇద్దరు కూడా కెప్టెన్సీ పోటీదారులుగా పరిగణించబడ్డారు. ఆ తర్వాత ప్రచారం టాస్క్‌లో భాగంగా బాబా భాస్కర్‌పై మహేష్ విట్టా కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇంటి సభ్యులలో మెజారీటీ మహేష్‌కు కెప్టెన్సీ రాలేదు కాబట్టి మహేష్‌కు ఛాన్స్ ఇద్దామని ఇచ్చేశారు. తోటి పోటీదారుడు బాబా భాస్కర్ కూడా అందరికి ఆ అవకాశం రావలని, మహేష్ గెలవాలని కోరుకోవడం విశేషం.
టాస్క్‌లో భాగంగా మహేష్ అధికారం వస్తే ఎలా ఉంటానో చూడాలని ఉంది, అందుకే నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను నేను తెలుసుకుంటా అని ప్రచారం చేశాడు. అంతేకాకుండా అందరికి కెప్టెన్‌గా ఆ అవకాశం రావాలని ఇంటి సభ్యులు ఆలోచించి మహేష్‌కు కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టారు. ఇక గురువు గారు అంటూ పిలిచే బాబా భాస్కర్‌పై మహేష్ విజేతగా నిలిచి కెప్టెన్ అయ్యాడు.