‘ఎంఎల్‌ఏ’ పరమ..అని తేల్చిన కత్తి మహేష్..

కొన్ని నెలలుగా కత్తి మహేష్ పేరు సోషల్ మీడియా లో మారుమోగిపోతున్న సంగతి తెల్సిందే. ఇటు సినిమాల ఫైన , అలాగే రాజకీయాల ఫై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న మహేష్ తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంఎల్‌ఏ’ మూవీ ఫై తన రివ్యూ తెలిపి , నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

రొటీన్ కథకు కాస్త పొలిటికల్ ట్విస్ట్ అద్ది తీసిన మరో పరమ ఫార్ములా సినిమా ఎంఎల్ఏ అని మహేష్ తెలిపాడు. ఒక నియోజకవర్గంలోని ఆధిపత్య గొడవల మధ్య ప్రేమకోసం ఎంఎల్‌ఏ అవ్వాలనే ఛాలెంజ్‌కు ఒప్పుకున్న హీరో, ఎలా ప్రజల కోసం ఎమ్మెల్యే అయ్యాడనేది కథ అని కత్తి చెప్పాడు. ఐడియాగా బాగున్నా, సింపుల్‌గా తీయబోయి సిల్లీ అయిపోయిన సీన్లు బోలెడున్నాయని వివరించాడు. ఫర్మార్మెన్సులు బాగున్నాయని, సాంకేతికంగా కూడా ఫరవాలేదని కత్తి చెప్పాడు. మామూలుగా ఉన్న మరో సినిమా చూడాలంటే ఓకే… అదే ఏదైనా కొత్తగా కావాలంటే ఇది కాదని కత్తి మహేశ్ తెలిపాడు.