Site icon TeluguMirchi.com

మ‌హేష్ తొంద‌ర‌ప‌డుతున్నాడు!

Mahesh-Babuqప్రస్తుతం సుకుమార్ ద‌ర్శక‌త్వంలో న‌టిస్తున్నాడు మహేష్‌ బాబు. ఈ సినిమా అవుట్‌ పుట్‌ పై మ‌హేష్ అసంతృప్తితో ఉన్నాడ‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్‌ లో చెప్పుకొంటున్నారు. సుకుమార్ ద‌ర్శక‌త్వ శైలిలో మ‌హేష్ ఇమ‌డ‌లేక‌పోతున్నాడట‌. ఆ మాట‌లో నిజం ఉన్నా లేక‌పోయినా.. త‌న త‌ర‌వాతి సినిమా గురించి మాత్రం.. మ‌హేష్ చాలా ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నాడు. సుక్కు సినిమా త‌ర‌వాత‌.. మ‌హేష్‌-శ్రీ‌నువైట్ల సినిమా మొద‌లుకాబోతోంది. ఈ సినిమాకి ‘ఆగ‌డు’ అనే పేరు ఖ‌రారు చేశారు. అందుకే మ‌హేష్ కూడా ఆగ‌ను అంటున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా సెట్స్‌ పైకి తీసుకెళ్లమ‌ని శ్రీ‌నువైట్ల పై ఒత్తిడి తీసుకొస్తున్నాడ‌ట‌. వీలైతే.. సుకుమార్ సినిమాకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి…. శ్రీ‌నువైట్ల తో జ‌త క‌ట్టాల‌నే ప్లాన్‌ లో ఉన్నాడు. సుకుమార్ సినిమాపై లేని ఆసక్తి… శ్రీ‌నువైట్ల సినిమాపై ఎందుక‌నేది… అటు ఇరు చిత్ర వ‌ర్గాల‌కూ అర్థం కావ‌డం లేదు.

Exit mobile version