Site icon TeluguMirchi.com

మ‌హేష్‌కు నిద్ర లేద‌ట‌!

mahesh-babu-sukumar-movieపాపం.. మ‌హేష్‌బాబు. తెగ క‌ష్టప‌డుతున్నాడు. రాత్రిళ్లు నిద్ర కూడా మానేస్తున్నాడు. నంది అవార్డు అందుకొన్న త‌ర‌వాత… వెంట‌నే ప‌రుగులు పెట్టేస్తున్నాడు. ఇందంతా సుకుమార్ సినిమా కోస‌మే. మ‌హేష్‌బాబు, సుకుమార్ క‌ల‌యిక‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో పోరాట దృశ్యాల‌ను తెరకెక్కిస్తున్నారు. గ‌త వారం రోజుల నుంచీ నైట్ ఎఫెక్ట్ లో ఫైట్ సీన్స్ తీస్తున్నారు. రాత్రి ప‌ది గంట‌ల‌కు మొద‌లై… తెల్లవారు ఝూమున ఐదింటి వ‌ర‌కూ ఫైట్ సీన్స్‌లో న‌టిస్తున్నాడ‌ట‌. దాందో మ‌హేష్‌కి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే అవుట్ పుట్‌పై మాత్రం ప్రిన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. క‌ష్టప‌డితేనే క‌దా? ఫ‌లితం ద‌క్కేది.

Exit mobile version