స్పైడర్ కు తెలంగాణ సెగ..

మళ్లీ తెలంగాణ సెగ సినిమా షూటింగ్ లకు తగిలింది..తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సినిమా సెట్స్ లను తగలబెట్టడం, సినిమా షూటింగ్ లను అడ్డు తగలడం వంటివి చేసారు..ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మళ్లీ ఆ సందర్భాలు రాలేదు..తాజాగా మరోసారి తెలంగాణ సెగ మహేష్ సినిమా కు తగిలింది.

మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని నిమ్స్ ఆవరణలో జరుగుతుంది. ఈ నేపథ్యం లో కొంతమంది ఉద్యమకారులు టీ- ప్ర‌భుత్వం వెంట‌నే నిమ్స్‌లో సౌక‌ర్యాలు పెంచాల్సిందిగా `స్పైడ‌ర్` షూటింగ్ ఆపేశారు. నిన్నంతా నిమ్స్‌లో జ‌ర‌గాల్సిన‌ షూట్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. వ్య‌తిరేకుల నినాదాల‌తో నిమ్స్‌ డైరెక్ట‌ర్ దిగొచ్చి.. అక్క‌డ షూటింగుకు అనుమ‌తులు ర‌ద్ధు చేసారు. దీంతో చిత్ర యూనిట్ అక్కడి నుండి వెళ్లిపోయారు.