Site icon TeluguMirchi.com

అభిమానుకు నిరాశే…‘స్పైడర్‌’ విడుదల వాయిదా..!

mahesh babu spyderసూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం క్రేజీ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. క్లైమాక్స్‌ సన్నివేశాలు, రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ మరియు టైటిల్‌ తాజాగా విడుదలయ్యి అంచనాలను తారా స్థాయికి చేర్చాయి. ఈ చిత్రాన్ని జూన్‌ 23న విడుదల చేయనున్నట్టు దర్శకుడు మురుగదాస్‌ ఎప్పుడో ప్రకటించాడు. దాంతో సూపర్‌ స్టార్‌ అభిమానులంతా కూడా ఆ రోజు కోసం చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విషయంలో చిత్ర యూనిట్‌ చాలా సార్లు అభిమానులను నిరాశ పర్చింది. ఎప్పుడో విడుదలవాల్సిన ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ కారణంగా చాలా ఆలస్యంగా విడుదల అయ్యింది. ఆ విషయంలో అభిమానులు చాలా నిరాశ పడ్డారు. తాజాగా ముందుగా అనుకున్న రిలీజ్‌ డేట్‌ కూడా వాయిదా పడిరది. ఈ చిత్రం జూన్‌ 23న విడుదల కావడం వాయిదా పడినట్టు నిర్మాతలు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన చేయకున్నా కూడా వేరే నిర్మాతలకు ‘స్పైడర్‌’ వాయిదా పడినట్టు సందేశాలను పంపుతున్నారు. దాంతో ఇతర చిత్రాలు అదే రోజున విడుదలకు ముస్తాబవుతున్నాయి.

Exit mobile version