Site icon TeluguMirchi.com

తాప్సికి భ‌య‌ప‌డిన మ‌హేష్‌?

mahesh taapseeఆగ‌డు సినిమాలో తాప్సి ఉందా? రెండో నాయిక‌గా ఆమెను ఎంచుకొన్నారా? గత కొన్ని రోజులుగా ఈ వార్త హ‌ల్‌చ‌ల్ చేసింది. తాప్సికి సినిమాల్లేని స‌మ‌యంలో ఓ ఛాన్స్‌.. దానికి తోడు మ‌హేష్ బాబు ప‌క్కన బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింది అనుకొన్నారు. కానీ అంతా తుస్సుమంది. ఈ సినిమాలో తాప్సి లేద‌ట‌. మ‌రో క‌థానాయిక ఉంది గానీ, ఆమె తాప్సి కాదు.. అని చిత్రబృందం చెబుతోంది. తాప్సి పేరు ముందు ప‌రిశీలించిన మాట నిజ‌మేగానీ, మ‌హేష్ మాత్రం నో చెప్పాడ‌ట‌. ”మ‌రో క‌థానాయిక‌ను చూడండి” అని ఆర్డర్ వేశాడ‌ట‌. దాంతో చిత్రబృందం ఆమె పేరు ప‌క్కన పెట్టారు. పాపం… తాప్సికి బంగారం లాంటి ఛాన్స్ అందిన‌ట్టే అంది చేజారిపోయింది.

Exit mobile version