Site icon TeluguMirchi.com

మహేష్ ‘వన్’ సెన్సార్ రిపోర్ట్ !

maheshమహేష్ ‘వన్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. ‘వన్’ కు సెన్సార్ బోర్డు ‘యు బై ఏ’ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు తెలుస్తుంది. ‘వన్’ కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్. చిత్రాన్ని లండన్, బ్యాంకాక్ లలో ఎక్కువ భాగం షూట్ జరిపారు. సెన్సార్ పూర్తవడంతో సినిమా రిలీజ్ డేట్ పై అనుమానాలు తొలిగాయి.

రిలీజ్ రికార్డ్ :

వన్ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఇరోస్‌ సంస్థ అంతే రేంజ్ లో మూవీ ని ఆ సంస్థ భారీగా రిలీజ్ చేస్తుంది. ఒక్క హైద‌రాబాద్ సిటిలోనే 108 ధియోట‌ర్లలో వ‌న్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పటి వ‌ర‌కూ టాలీవుడ్‌లో ఏ మూవీని సైతం హైద‌రాబాద్‌లో ఇన్ని ధియోట‌ర్లలో రిలీజ్ చేయ‌లేదు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా, ఆంద్రప్రదేశ్‌లోని ప‌లు న‌గ‌రాల్లో ఈదేవిధంగా రిలీజ్‌ చేస్తున్నారు. బెంగుళూరులో అయితే ఏకంగా అర‌వై ధియోట‌ర్లతో రిలీజ్ అవుతూ రికార్డ్‌ను కొట్టేసింది. రిలీజ్ కు ముందే రికార్డ్ లు సృష్ఠిస్తున్న మహేష్ రీలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్ లు క్రియోట్ చేస్తాడో చూడాలి.

Exit mobile version