ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ మహేష్ బాబు ‘వన్’ మూవీ. సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ విడుదలకు ముందే సంచలనాలు రేకెత్తిస్తుంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మూవీకు జరగని విధంగా, వన్ మూవీ బిజినెస్ జరిగింది. అంతే కాకుండ మూవీ షూటింగ్ దశలోనే ఉండగా, ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ ఇరోస్, వన్ మూవీను డెబ్భై కోట్లకు పైగానే కొనేసింది. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డ్. మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ బిజినెస్ జరగటం అనేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీను ఆశ్ఛర్యపరిచింది.
ఈ తరహా బిజినెస్ బాలీవుడ్‌లోనూ ఇప్పటి వరకూ జరగలేదు. అయితే అంతే రేంజ్ లో వన్ మూవీ ని ఆ సంస్థ భారీగా రిలీజ్ చేస్తుంది. ఒక్క హైదరాబాద్ సిటిలోనే 108 ధియోటర్లలో వన్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకూ టాలీవుడ్లో ఏ మూవీని సైతం హైదరాబాద్‌లో ఇన్ని ధియోటర్లలో రిలీజ్ చేయలేదు.ఇక ఆరోజంతా హైదరాబాద్ సిటిలో ‘వన్’ హంగామానే. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా, ఆంద్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఈదేవిధంగా రిలీజ్ చేస్తున్నారు. బెంగుళూరులో అయితే ఏకంగా అరవై ధియోటర్లతో రిలీజ్ అవుతూ రికార్డ్‌ను కొట్టేసింది. రిలీజ్ కు ముందే రికార్డ్ లు సృష్ఠిస్తున్న మహేష్ రీలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్ లు క్రియోట్ చేస్తాడో చూడాలి.