మహేష్ ఓకే చెప్పేశాడు!

Koratala-shiva-mahesh-babuమిర్చి డైరెక్టర్ కొరటాల శివ చిత్రం చేయడానికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. డేట్స్ కూడా ఇచ్చేశాడు. ఈ మూవీ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో.. అసలు శివతో మహేష్ సినిమా వుంటుందా? వుండదా? అన్న అనుమానాలకు తెరపడింది. ప్రస్తుతం మహేష్ ఆగడు షూటింగ్ లో బిజీగా వున్నాడు. దీని తరవాత శివ సినిమా చేయనున్నాడు. ప్రభాస్ ని మిర్చిలో సూపర్ గా ప్రమోట్ చేశాడు కొరటాల. ఇప్పడు ప్రిన్స్ మహేష్ ను డిఫరెంట్ యాంగిల్ లో చూపించేందుకు రెడీ అయిపోయాడు. శివ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మరింత వేగవంతం చేశాడు. మరీ.. మహేష్ సరసన జతకట్టే హీరోయిన్ ఎవరు.. ?.. తదితర వివరాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.